బాలిక ఆత్మహత్య.. నిందితుడికి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

బాలిక ఆత్మహత్య.. నిందితుడికి రిమాండ్‌

Apr 28 2026 8:46 AM | Updated on Apr 28 2026 8:46 AM

బంట్వారం: బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడిని సోమవారం రిమాండ్‌కు తరలించామని కోట్‌పల్లి ఎస్‌ఐ శైలజ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన ప్రకారం.. కోట్‌పల్లి మండలం నాగసాన్‌పల్లికి చెందిన కాళ్ల సాకేత్‌.. బాలికను ప్రేమపేరుతో వేధించేవాడు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన బాలిక.. ఈ నెల 23న పురుగు మందు తాగి బలవన్మరణానికిపాల్పడింది. సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 25న మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

గృహిణి ఆత్మహత్య కేసులో ఇద్దరికి..

యాలాల: భర్త, తోటికోడలు వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన గృహిణి కేసులో ఇద్దరిని సోమవారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చెన్నారం గ్రామానికి చెందిన జటంగి దేవి(33)ని, ఆమె భర్త హన్మంతు నిత్యం మానసికంగా, శారీరకంగా వేధించేవారు. ఈ నెల 13న డబ్బుల విషయంలో గొడవ జరగగా.. మనస్తాపం చెందిన ఆమె గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన స్థానికులు బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ 21న మృతి చెందింది. మృతురాలి తండ్రి శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు.. దేవి మృతికి కారణమైన హన్మంతు, తోటి కోడలు సావిత్రమ్మపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement