అన్నదాత చెంతకు వ్యవసాయ పరిశోధకులు
బొంరాస్‌పేట: వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శాసీ్త్రయ పద్ధతులను అన్నదాతలకు నేరుగా చేరవేయాలని సంకల్పించింది. తద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే పంటలను ప్రోత్సహించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం ప్రారంభమైన ఈ కార్యక్రమం మే 23వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా కొనసాగనుంది. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాగులో మెళకువలపై అవగాహన కల్పించనున్నారు. సోమవారం బొంరాస్‌పేట మండలంలోని తుంకిమెట్ల గ్రామంలో, చౌడాపూర్ మండల కేంద్రంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు పాటించి రైతులకు సాగు పద్ధతులు, మెళకువలపై అవగాహన కల్పించారు.
ఉద్దేశాలు.. కార్యక్రమాలు
శాస్త్రవేత్తల సూచనలు
ఫోన్‌లో శాస్త్రవేత్తలు..
జిల్లాలోని 20 మండలాల్లో..
జిల్లాలో ఈ కార్యక్రమం అమలుకు ఐదు బృందాలు ఏర్పాటు చేశారు. 40 గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లాలో వరుసగా చౌడాపూర్, బొంరాస్‌పేట, బషీరాబాద్, పెద్దేముల్, తాండూరు, దౌల్తాబాద్, దుద్యాల్, దోమ, మర్పల్లి, యాలాల, బంట్వారం, కుల్కచర్ల, ధారూరు, మోమిన్‌పేట, కోట్‌పల్లి, కొడంగల్, పరిగి, నవాబుపేట, పూడూరు, వికారాబాద్ మండలాల్లో శాస్త్రవేత్తలు పర్యటించనున్నారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు రైతులతో మమేకమై వారి సమస్యలను నివృత్తి చేస్తారు. పంటల సాగుపై అవగాహన కల్పిస్తారు.
ఆరోగ్యకర నేల కోసం..
సేంద్రియ పద్ధతులు పా టించి ఆరోగ్యకరమైన నేల ను భావితరాలను అందించేందుకు ఈ కార్యక్రమం ఉపయుక్తం. ఈ ఉద్దేశాన్ని రైతులు పాటించడం లేదు. ఆదాయ పంటలపై మక్కువతో రసాయనాలను మోతాదుకు మించి వాడుతూ నేలసారాన్ని నాశనం చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయంలో కంపోస్టు, పశువుల పేడ, వానపాముల, కోళ్ల, పచ్చిరొట్టె ఎరువులు, జీలుగ, జనుము వీటన్నింటిపై అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం. గొప్ప శాస్త్రవేత్తలు రైతులకు వద్దకు వచ్చిచెప్పే సదావకాశం.
– ప్రొ. డాక్టర్ సత్యనారాయణ, నేలవృచ్చిక శాస్త్రం శాస్త్రవేత్త, పాలెం పరిశోధన కేంద్రం


