స్వర్ణ కిరణం | - | Sakshi
Sakshi News home page

స్వర్ణ కిరణం

Apr 28 2026 8:40 AM | Updated on Apr 28 2026 8:40 AM

● 2021లో కేరళలో నిర్వహించిన సౌత్‌జోన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ షాట్‌పుట్‌ పోటీల్లో తెలంగాణ తరఫున వెండి పతకం సాధించాడు. ● 2023లో నిర్వహించిన సౌత్‌జోన్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో స్వర్ణ పతకం. ● 2024, 2025లో ఏపీలో జరిగిన సౌత్‌జోన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలో వరుసగా రెండు సార్లు బంగారు పతకాలు. ● 2024లో బిస్లాపూర్‌లో నిర్వహించిన యూత్‌ నేషనల్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో గోల్డ్‌ మెడల్‌. ● 2025లో ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన జూనియర్‌ ఫెడరేషన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో బంగారు పతకం. ● 2025లో భువనేశ్వర్‌లో జరిగిన జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో స్వర్ణం. ● 2026లో భువనేశ్వర్‌లో జరిగిన ఇండోర్‌ నేషనల్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో వెండి పతకం. ● 2026 ఏప్రిల్‌ 25న కర్ణాటక రాష్ట్రంలోని తుమ్‌కూర్‌లో నిర్వహించి అండర్‌ 20 నేషనల్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ పోటీల్లో గోల్డ్‌ మెడల్‌. ● చైన్నె, భూపాల్‌లో నిర్వహించిన పోటీల్లో రెండుసార్లు బంగారు పతకాలు. ● ఇవే కాకుండా సాధారణంగా రాష్ట్ర స్థాయిలో దాదాపుగా 25కి పైగాబంగారు పతకాలు సాధించాడు.

మారుమూల పల్లెలో పుట్టి రాష్ట్రం తరఫున పతకాల పంట సౌత్‌జోన్‌, జాతీయ, ఖేలో ఇండియా, రాష్ట్ర స్థాయి క్రీడల్లో యాభైకిపైగా మెడల్స్‌ దేశం తరఫున ఆడేందుకుసై అంటున్న హస్నాబాద్‌ కుర్రాడు

దుద్యాల్‌: మారుమూల ప్రాంతంలోని ఓ పేదింట్లో పుట్టిన క్రీడాకారుడు బంగారు పతకాలతో సత్తాచాటుతూ రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తున్నాడు. జిల్లాలోని దుద్యాల్‌ మండలం హస్నాబాద్‌కు చెందిన అల్వాల్‌ సాయికిరణ్‌ పుట్టి పెరిగింది సొంతూరిలోనే. గ్రామంలోనే ప్రాథమిక విద్య పూర్తిచేశాడు. అనంతరం గురుకుల సీటు రావడంతో ఎంజేపీ గురుకులంలో చేరి ఇంటర్‌ వరకు అక్కడే చదివాడు. పాఠశాలలో నిర్వహించే షాట్‌పుట్‌ పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చేవాడు. ఈక్రమంలో ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో సత్తాచాటి, క్రీడాధికారుల దృష్టిని ఆకర్షించాడు. దీంతో ప్రభుత్వం తరఫున ఇండోర్‌ స్టేడియంలో ప్రత్యేక కోచ్‌ను ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించారు. దేశంలో ఎక్కడ పోటీలు జరిగినా సాయికిరణ్‌ను తీసుకెళ్తున్నారు. ఇలా వెళ్లిన చోటల్లా బంగారు పతకం సాధిస్తూ భేష్‌ అనిపించుకుంటున్నాడు.

సాధించిన పతకాలు..

షాట్‌పుట్‌లోసత్తాచాటుతున్న సాయికిరణ్‌

దేశం తరఫున ఆడేందుకు సిద్ధం

ప్రభుత్వ సహకారంతో షాట్‌పుట్‌లో సత్తా చాటుతున్నా.మాది పే ద కుటుంబం సర్కా రు నుంచి మరింత ప్రోత్సాహం లభిస్తే భారత్‌ తరఫున పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నా. శ్రమ, పట్టుదలను నమ్ముకుని ముందుకు సాగుతున్నా.

– సాయికిరణ్‌, అథ్లెట్‌

Advertisement
 
Advertisement
Advertisement