బాలల రక్షణ మన బాధ్యత | - | Sakshi
Sakshi News home page

బాలల రక్షణ మన బాధ్యత

Apr 28 2026 8:40 AM | Updated on Apr 28 2026 8:40 AM

● డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం ● కలెక్టర్‌ దీపక్‌ తివారి

అనంతగిరి: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భా గంగా మే 2వ తేదీ వరకు బాలల భద్రత, రక్షణ, డ్రగ్స్‌ రహిత సమాజం అనే అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ దీపక్‌ తివారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడి యో కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.. బాలల భద్రత, డ్రగ్స్‌ రహిత సమాజంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, యువతను భాగస్వాములను చేయాలన్నారు. మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండేలా చూడాలన్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించాలని పేర్కొన్నారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ రాములు నాయక్‌, సీపీఓ వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఏ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

స్వీయ గణన చేసుకున్న కలెక్టర్‌

జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా సోమవారం కలెక్టర్‌ దీపక్‌ తివారి స్వయ గణన నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా సిస్టంలో తమ వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం సెల్ఫ్‌ ఎమ్యూ నరేషన్‌ పోస్టర్‌ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు.

ప్రజావాణికి 145 ఫిర్యాదులు

ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా వాణికి వివిధ గ్రామాలకు చెందిన పలువురు 145 అర్జీలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయి లో విచారణ చేపట్టి పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు వెంకటాచారి, ఉమాశంకర్‌ ప్రసాద్‌, జెడ్పీ సీఈఓ సుధీర్‌, ఆర్‌డీఓ వాసుచంద్ర, డీఆర్‌డీఓ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement