జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం
బొంరాస్‌పేట: రైతులు వరి ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని జిల్లా వ్యవసాయాధికారి టి.రాజరత్నం అన్నారు. సోమ వారం మండలంలోని నాగిరెడ్డిపల్లి, కొత్తూరు గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. క్వింటాలు ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. అవసరం మేరకు గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచామన్నారు. మెట్లకుంట, వడిచర్ల, బాపల్లి, చౌదర్‌పల్లి, తుంకిమెట్ల, ఏర్పుమళ్ల కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి, కొడంగల్ ఏడీఏ శంకర్ రాథోడ్, ఏఓ పోలప్ప, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రాములు గౌడ్, డైరెక్టర్ మల్లేశ్, జయకృష్ణ, నాయకులు భీంరెడ్డి ఢాక్యా నాయక్, సర్పంచ్ అనిత తదితరులు పాల్గొన్నారు.
‘టాలెంట్ సర్చ్’
అభినందనీయం
యాలాల: ఇటీవల మండల స్థాయిలో నిర్వహించిన టాలెంట్ సర్చ్ టెస్ట్ కార్యక్రమం అభినందనీయమని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నా రు. సోమవారం ఎమ్మెల్యేను ఎంఈఓ మహిపాల్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టాలెంట్ సర్చ్ టెస్ట్ కార్యక్రమ వివరాలను అడిగి తెలుసుకున్నారు. జూన్‌లో నియో జకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాల ని విద్యాశాఖకు చెందిన అధికారులను ఎమ్మె ల్యే ఆదేశించారు. అనంతరం ఎంఈఓను సన్మానించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృష్ణారెడ్డి, రాములు, ప్రతినిధులు శ్రీధర్‌రెడ్డి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


