● నేలరాలిన మామిడి కాయలు ● ఇళ్లపై పడిన విద్యుత్ స్తంభాలు
పూడూరు: మండలంలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులు, వడగండ్లు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మా మిడి పంటకు భారీ నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు కాయలు నేలరాలాయి. మండలంలో మామిడి తోటలు అధికంగా ఉన్నాయి. స గానికిపైగా కాయలు రాలిపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్కేపల్లిలో విద్యుత్ స్తంభాలు ఇళ్లపై పడ్డాయి. చెట్లు నేలకొరిగాయి. మండలంలోని మోడల్ స్కూల్ సమీపంలో ప్రధాన రోడ్డుపై చెట్లు పడింది. దీంతో రాకపో కలకు అంతరాయం కలిగింది. జేసీపీతో కూలిన చెట్టును తొలగించారు.
నవాబుపేటలో భారీ వర్షం
నవాబుపేట: మండలంలో సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. మధ్యాహ్నం వరకు ఎండ దంచి కొట్టింది. సాయంత్రం భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.


