బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

బాధ్యతల స్వీకరణ

Apr 27 2026 8:36 AM | Updated on Apr 27 2026 8:36 AM

బాధ్యతల స్వీకరణ టీఎన్‌జీఓల సంఘం నూతన కమిటీ ఎన్నిక

ఇబ్రహీంపట్నం రూరల్‌: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా డాక్టర్‌ కిరణ్మయి కొప్పిశెట్టి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్‌కలెక్టర్‌గా పని చేశారు. జిల్లా అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె కలెక్టర్‌ నారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇబ్రహీంపట్నం రూరల్‌: టీఎన్‌జీఓల సంఘం అర్బన్‌ యూనిట్‌ నూతన కమిటీ ఎన్నికను ఆదివారం నిర్వహించారు. పలుబాయి ఈశ్వర్‌ పర్యవేక్షణలో ఎన్నిక కొనసాగింది. అధ్యక్షుడిగా గోపాల్‌ నాయక్‌ (వ్యవసాయ శాఖ), కార్యదర్శిగా సాయితేజ (ట్రెజరీ), ఏంఏ ఫిరోజ్‌ (ఆడిట్‌ విభాగం), ఉపాధ్యక్షులుగా శ్రీపతికుమార్‌ (వ్యవసాయ శాఖ), రవి, జి.సాయికుమార్‌ (ట్రెజరీ), సంయుక్త కార్యదర్శిగా స్వాగ్యవతి (సీ్త్ర సంక్షేమశాఖ), ఆర్గనైజింగ్‌ సెక్రట్రీగా భిక్షపతి(రెవెన్యూ), ప్రచార కార్యదర్శిగా మల్లేష్‌ (గిరిజన సంక్షేమశాఖ), ఈసీ సభ్యులుగా బాలరాజు, శంకర్‌ రాథోడ్‌ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో అడ్‌హక్‌ కమిటీ నాయకులు రంగయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement