గొప్ప సంఘ సంస్కర్త పోతులూరి | - | Sakshi
Sakshi News home page

గొప్ప సంఘ సంస్కర్త పోతులూరి

Apr 27 2026 8:36 AM | Updated on Apr 27 2026 8:36 AM

శాసన మండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి

ఖాంజాపూర్‌ గుట్ట వద్ద ఆలయ నిర్మాణానికి భూమిపూజ

తాండూరు రూరల్‌: పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గొప్ప సంఘ సంస్కర్త అని శాసన మండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. ఆదివారం మండలంలోని ఖాంజాపూర్‌ గుట్ట వద్ద విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాస్త్ర, సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందని కాలంలోనే స్వామివారు కాలజ్ఞానం ద్వారా భవిష్యత్‌ వాణి వినిపించారని కొనియాడారు. తెలుగు నేల గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మిక వేత్త అని పేర్కొన్నారు. కలియుగంలో జరిగే అనేక వింతలు, సామాజిక మార్పులు, విపత్తులను తన తాళపత్ర గంథాల్లో పొందుపరిచారని చెప్పారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన మండలి చీఫ్‌విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పురుషోత్తంరావు, శ్రీనివాసాచారి, ఎం.శ్రీనివాసాచారి, జయప్రసాద్‌, పులేందర్‌, యాదగిరి, పాండురంగాచారి, బాలకృష్ణ, వినోద్‌ కుమారాచారి, రమేష్‌, లక్ష్మణచారి, తిప్పన్నచారి పాల్గొన్నారు.

విశ్వకర్మలకు అండగా ఉంటాం

వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి మండలి, ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.50 లక్షల చొప్పున మంజూరు చేస్తామని మండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి తెలిపారు. విడతల వారీగా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మలకు అండగా ఉంటామన్నారు. ఆలయ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు పంజుగుల విఠల్‌రెడ్డి అన్నారు. తన కుమారుడు పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విశ్వకర్మల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement