పరిగి: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నా రు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని నస్కల్ గ్రామంలో బీరప్ప ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల మతాలకు అతీతంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని సూచించారు. భక్తి మార్గంతో నే ముక్తి లభిస్తుందన్నారు. అనంతరం పరిగిలో జరిగిన వాసవిమాత జయంతిలో పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం
కుల్కచర్ల: కార్యకర్తలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. వారం రోజుల క్రితం డ్రోన్ ప్రమాదంలో గాయపడిన రాంపూర్ సర్పంచ్ చెక్కల తిరుపతయ్య, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు వెంకటయ్య ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రోన్ ప్రమాదం అనుకోకుండా జరిగిన ఘటన అని పేర్కొన్నారు. ఇద్దరికి మినహా ఎవ్వరికీ పెద్ద ప్రమాదం జరగలేదన్నారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం దాస్యనాయక్ తండాలోని పంచముఖ ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కవిత రాజు, పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, ముజాహిద్‌పూర్ సర్పంచ్ చంద్రభూపాల్ రావు, నాయకులు హరిలాల్, వెంకటయ్య, రాంచంద్రయ్య, తులసీరాం నాయక్, శంకర్ నాయక్, హన్మంతు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి


