గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Apr 27 2026 8:36 AM | Updated on Apr 27 2026 8:36 AM

కొడంగల్‌: నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్నీ అభివృద్ధి చేయాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని కొడంగల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ నందారం ప్రశాంత్‌ అన్నారు. మండలంలోని పర్సాపూర్‌లో రూ.30 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన పనులకు ఆదివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్‌ తిరుపతిరెడ్డి సహకారంతో నియోజకవర్గ ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ ప్రాంతానికి అధిక మొత్తంలో నిధులు వస్తున్నట్లు చెప్పారు. విద్య, వైద్య రంగాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ శివకుమార్‌ గుప్తా, పర్సాపూర్‌ గ్రామ సర్పంచ్‌ రాధ శ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ బెస్త శివమ్మ, నాయకులు తట్టెపల్లి రాములు, శ్రీశైలం, గోరిపల్లి ఆంజనేయులు, బానకారి నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ చైర్మన్‌ ప్రశాంత్‌

Advertisement
 
Advertisement
Advertisement