బొంరాస్‌పేట: స్థానిక కవులు, సాహిత్య కృషిని వెలికి తీయడంలో వికారాబాద్ జిల్లా అనంత వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. తెలంగాణ వాగ్గేయకారుడు, జిల్లా ప్రముఖ కవి శ్రీ రాకమచర్ల వెంకటదాసు సంచికను ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి పలువురు రాకమచర్ల సంకీర్తలను కీర్తించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి సంచికను ఆవిష్కరించారు. రాకమచర్ల సంకీర్తలను ప్రచారం చేయడంలో జిల్లా కవులు, రచయితల ప్రాత ఎంతో ఉందన్నారు. కార్యక్రమంలో అనంత వ్యవస్థాపకులు దోరవెటి చెన్నయ్య, అధ్యక్షుడు ఆశీర్వాదం, కార్యదర్శి కమలేశ్, ఉపాధ్యక్షుడు వడిచర్ల సత్యం, అనంత సభ్యులు రవూఫొద్దీన్, మధుసూదన్‌రావు, డాకన్న, సురేశ్, రమేశ్, మల్లికార్జున్, రవికృష్ణస్వామి, రామన్న తదితరులు పాల్గొన్నారు.
భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి


