ఈత నేర్చుకునేందుకు వెళ్లి.. | - | Sakshi
Sakshi News home page

ఈత నేర్చుకునేందుకు వెళ్లి..

Apr 27 2026 8:36 AM | Updated on Apr 27 2026 8:36 AM

దోమ: ఈత నేర్చుకునేందుకు వెళ్లిన ఓ బాలుడు బావిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమ మండలం దిర్సంపల్లి గ్రామానికి చెందిన కారవొని నాగేశ్‌కు ఏడేళ్ల బాలుడు శివకుమార్‌ ఉన్నాడు. వేసవి సెలవులు కావడంతో శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా కొయిలకొండ మండలం కొత్లాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆదివారం పెద్దనాన్నతో కలిసి గ్రామ సమీపంలోని బావిలో ఈత నేర్చుకునేందుకు వెళ్లాడు. అందరూ చూస్తుండగా శివకుమార్‌ బావిలోకి దూకాడు. ఎంతసేపటికీ బయటికి రాలేదు. దీంతో అక్కడే ఉన్న కొందరు గాలింపు చర్యలు చేపట్టారు. నీట మునిగిన బాలుడిని బయటికి తెచ్చారు. అప్పటికే శివకుమార్‌ చనిపోయాడు. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

నీట మునిగి చిన్నారి మృతి

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘటన

దిర్సంపల్లిలో విషాదం

Advertisement
 
Advertisement
Advertisement