విన్యాసం.. అద్భుతం | - | Sakshi
Sakshi News home page

విన్యాసం.. అద్భుతం

Apr 27 2026 8:36 AM | Updated on Apr 27 2026 8:36 AM

10 రాష్ట్రాలు..11 నిమిషాలు..

1,212 మంది క్రీడాకారులు

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో కరాటే ప్రదర్శన

గచ్చిబౌలి: గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం అరుదైన అంతర్జాతీయ ఘనతకు వేదికై ంది. కరాటే రంగంలో తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలో 1,212 మంది క్రీడా కారులు ప్రదర్శన ఇచ్చి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకున్నారు. జయంత్‌రెడ్డి ఇంటర్నేషనల్‌ తైక్వాండో అకాడమీ, విజన్‌ మార్షల్‌ ఆర్ట్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కేవలం 11 నిమిషాల వ్యవధిలో 1,212 మంది కరాటే క్రీడాకారులు అత్యంత క్రమశిక్షణతో, ఏకదాటిగా తమ విన్యాసాలను ప్రదర్శించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా సుమారు 10 రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఈ ఫీట్‌లో భాగస్వాములయ్యారు. ఈ తక్కువ సమయంలో లక్షలాది పంచులు, బ్లాక్స్‌ నమోదయ్యాయి. గతంలో ఉన్న 8 నిమిషాల రికార్డులను అధిగమిస్తూ ఇంత భారీ సంఖ్యలో క్రీడాకారులు ఏకతాటిపైకి వచ్చి ఈ ఘనత సాధించారు. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధి స్వప్నిల్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రదర్శనను పరిశీలించారు. అనంతరం నిర్వాహకులకు ధృవీకరణ పత్రాన్ని అధికారికంగా అందజేశారు. గ్రాండ్‌ మాస్టర్‌ జయంత్‌రెడ్డి, విఠల్‌, సుమన్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement