మీర్‌పేట: వైశ్యులు వ్యాపారంలో నిబద్ధతతో, ఆలోచనా విధానంలో సద్భావతనో ఉంటారని డీసీసీ అధ్యక్షుడు, టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి అన్నారు. మీర్‌పేట దీన్‌దయాల్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన వాసవిమాత ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, జయంతి వేడుకలకు ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఆలయం నిర్మించిన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ ప్రాంత ప్రజలందరికి అమ్మవారి ఆశీర్వాదం ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైశ్యులకు కార్పొరేషన్ చైర్మన్‌తో పాటు ఆర్యవైశ్య భవన నిర్మాణానికి నిధులు ఇస్తానని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓ వైపు ప్రజల సంక్షేమంతో పాటు మరో వైపు ఆలయాలను అభివృద్ధికి సహకారం అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తెరేటిపల్లి శ్రీనివాస్‌గుప్తా, అధ్యక్షుడు శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన కార్యదర్శి సురేష్‌గుప్తా, గందే వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్‌గౌడ్, సంతోశ్‌కుమార్, గజ్జెల రాంచందర్, శేఖర్‌రెడ్డి, సైదులు, మురళీగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి


