ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన కోర్సులు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన కోర్సులు

Apr 26 2026 4:57 AM | Updated on Apr 26 2026 4:57 AM

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన కోర్సులు

దోస్త్‌ సహాయ కేంద్రాన్ని వినియోగించుకోవాలి

ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ లక్ష్మణ్‌

తాండూరు టౌన్‌: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన కోర్సులు ప్రవేశ పెట్టినట్లు ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ ఎస్‌ లక్ష్మణ్‌ తెలిపారు. డిగ్రీలో అడ్మిషన్‌ పొందాలనుకునే విద్యార్థులు దోస్త్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. శనివారం కళాశాలలో దోస్త్‌ జిల్లా స్థాయి సహాయక కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుతున్న కాలం దృష్ట్యా విద్యార్థుల భవిష్యత్‌కు అనుకూలంగా కళాశాలలో నూతన కోర్సులను ప్రవేశ పెట్టామన్నారు. బీఎస్సీ(ఫిజికల్‌ సైన్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌), బీఎస్సీ(లైఫ్‌ సైన్సెస్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌), బీకాం(రిటైల్‌ ఆపరేషన్‌), బీఏ(మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం), బీఏ (సోషియాలజి, ఆంథ్రోపాలజి, సైకాలజి, జియోగ్రఫి, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌) వంటి కోర్సులు అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే కళాశాలలో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యం కలిగిన నాలుగు అధునాతన డిజిటల్‌ తరగతుల సౌకర్యం, అత్యాధునిక నూతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వర్చువల్‌ తరగతి ఉన్నట్లు చెప్పారు. ఈ కోర్సుల్లో చేరడానికి ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు కళాశాలలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని వినియోగించుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, దోస్త్‌ సమన్వయ కర్త మహేందర్‌ రెడ్డి సెల్‌ నంబర్‌ 9885583432, టెక్నికల్‌ కో ఆర్డినేటర్‌ అమర్‌ సెల్‌ నంబర్‌ 9849432029, కిషన్‌ సెల్‌ నంబర్‌ 9959531273ను సంప్రదించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement