పూడూరులో మరో పారిశ్రామిక వాడ | - | Sakshi
Sakshi News home page

పూడూరులో మరో పారిశ్రామిక వాడ

Apr 26 2026 4:51 AM | Updated on Apr 26 2026 4:51 AM

పూడూరు: మండల పరిధిలో మరో పారిశ్రామిక వాడ ఏర్పాటు కానుంది. గతంలో రాకంచర్లలో నెలకొల్పారు. అప్పట్లో విశాలమైన రహదారులు, విద్యుత్తు సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం అందులో 15 వరకు పరిశ్రమలు వెలిశాయి. త్వరలో మీర్జాపూర్‌లో రెండో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఇందుకు కండ్లపల్లి, మీర్జాపూర్‌, కొత్తపల్లిలో ఉన్న అసైన్డ్‌ భూమితో పాటు ప్రైవేటు జాగాను సైతం సెకరించి (టీఎస్‌ఐఐసీ) పారిశ్రామిక వాడకు అప్పగించేందుకు రెవిన్యూయంత్రాంగం పావులు కదుపుతోంది. వెయ్యి ఎకరాలు అవసరం ఉందని పారిశ్రామిక శాఖ.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం రెవిన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేయడంతో.. ఆ శాఖ అధికారులకు ఆయా గ్రామాల్లో సర్వే నంబర్లలోని సర్కారు భూమితో పాటు.. ప్రైవేటు పట్టా స్థలానికి సంబంధించి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. మూడు గ్రామాల్లో వెయ్యి ఎకరాలు పారిశ్రామిక వాడలో కలిసి పోనుంది

90శాతం అసైన్డ్‌ భూములే

పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ప్రతిపాదించిన భూమి 90 శాతం ప్రభుత్వం నిరుపేద రైతులకు అసైన్డ్‌ చేసిందే. ఆ భూముల్లో వారు బావులు, బోర్లు వేసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఏడాదిలో రెండు పర్యాయాలు పంటలు వచ్చే భూములు కోల్పోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. పేద రైతుల ఆర్థిక వనరులైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది.

డ్రోన్‌ కెమెరాలతో సర్వే

పరిశ్రమలకు ముఖ్యంగా రోడ్డు సౌకర్యంతో పాటు నీరు పుష్కలంగా ఉండి, నగరానికి చేరువలో ఉండటంతో పారిశ్రామిక ఏర్పటుకు ప్రభుత్వంసంకల్పించింది. ఈ ప్రాంతంలో నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం పూర్తయితే.. రవాణా వ్యవస్థ సులభం అవడటంతో పాటు.. 40 నిమిషాల్లో నగరానికి చెరుకోవచ్చు. అప్ప జంక్షన్‌ నుంచి పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసే మీర్జాపూర్‌, కండ్లపల్లి వరకు 50 కిలో మీటర్ల లోపే. మన్నెగూడ వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ రోడ్డు పూర్తయితే ట్రాఫిక్‌ సమస్య తీరనుంది. పారిశ్రామిక ఏర్పాటు నేపథ్యంలో రెండు రోజుల క్రితం మీర్జాపూర్‌, కండ్లపల్లి, కొత్తపల్లి, చేవెళ్ల పరిధి హస్తేపూర్‌ రెవిన్యూ పరిధిలో డ్రోన్‌ కెమెరాలతో సర్వే చేశారని రైతులు తెలిపారు. ఇదే విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన కలెక్టర్‌తో మాట్లాడినట్లు సమాచారం.

నాడు రాకంచర్లలో..నేడు మీర్జాపూర్‌లో

ఇండసి్ట్రయల్‌ పార్కుఏర్పాటుకు సర్కారు శ్రీకారం

వెయ్యి ఎకరాలకు

టీఎస్‌ఐఐసీ ప్రతిపాదనలు

భూ సర్వే పనుల్లో

రెవెన్యూ అధికారుల బిజీ

ఆ గ్రామాల భూమలను పరిశీలిస్తున్నాం

భూ సేకరణకు పరిశ్రమల శాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. కండ్లపల్లి, మీర్జాపూర్‌, కొత్తపల్లి గ్రామాల్లో కలిపి వెయ్యి ఎకరాలకు సంబంధించి సర్వే నంబర్లతో కూడిన వివరాలు ఉన్నాయి. రైతులతో మాట్లాడి.. ఆ భూముల వివరాలు సేకరిస్తున్నాం. మూడు గ్రామాల జాగాలను పరిశీలిస్తున్నాం. సేకరణ అనంతరం నివేదికను ఉన్నతాధికారులకుపంపిస్తాం. భూములను సర్వే చేసినట్లు మా దృష్టికిరాలేదు.

–విజయ్‌కుమార్‌, తహసీల్దార్‌, పూడూరు

Advertisement
 
Advertisement
Advertisement