బషీరాబాద్: బషీరాబాద్ ఎస్‌ఐ శ్రీశైలం యాదవ్‌ను వికారాబాద్ టౌన్ పీఎస్‌కు అటాచ్ చేశారు. ఆర్టీసీ సమ్మె బందోబస్తులో భాగంగా ఈనెల 23న వికారాబాద్ వెళ్లిన ఆయనను సీఐ కార్యాలయంలో విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. ఈఅంశాన్ని పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. మార్చి 13న బషీరాబాద్ ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన శ్రీశైలం వచ్చీరావడంతోనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇసుక అక్రమార్కులతో అంటకాగడం, విధుల్లో నిర్లక్ష్యం కారణంగా కేవలం నెలరోజుల్లోనే నాలుగు మెమోలు అందుకున్నారు. అటాచ్ విషయమై వివరణ తీసుకునేందుకు ఫోన్ చేయగా ఎస్‌ఐ అందుబాటులోకి రాలేదు.
ఆధ్యాత్మిక చింతనతో
మానసిక ప్రశాంతత
సీఐ సీతారాం
షాద్‌నగర్: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని సీఐ సీతారాం, మున్సిపల్ చైర్మన్ బస్వం అన్నారు. శనివారం వారు పట్టణ శివారులోని చౌడమ్మగుట్ట హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు ఆధ్మాత్మిక చింతన అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం మాజీ కౌన్సిలర్ లతాశ్రీ, శ్రీశైలంగౌడ్ దంపతులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.


