నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

Apr 26 2026 4:51 AM | Updated on Apr 26 2026 4:51 AM

వెంచర్లు, ఇళ్ల నిర్మాణాలకు

నిబంధనలు తప్పనిసరి

ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్‌ స్నేహ

యాచారం: ఫ్యూచర్‌సిటీ కింద గుర్తించిన ప్రాంతంలో నింబంధనల ప్రకారమే వెంచర్లు, ఇంటి నిర్మాణాలను చేపట్టాలని, ఆ విధంగా ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించాలని ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్‌ స్నేహ అన్నారు. శనివారం యాచారం మండల పరిషత్‌ కార్యాలయంలో నింబంధనల అమలుపై వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫ్యూచర్‌సిటీతో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ఆ విధంగానే అనుమతులు పొందాల్సి ఉంటుందని చెప్పారు. ఫ్యూచర్‌సిటీ విలీన గ్రామాల్లో నింబంధనల ప్రకారం అనుమతులు ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకొవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలుంటాయన్నారు. అథారిటీ పరిధిలో నింబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏపీఓ లక్ష్మీనారాయణ, మండల పంచాయతీ అధికారి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement