సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సద్వినియోగం చేసుకోవాలి

Apr 25 2026 9:24 AM | Updated on Apr 25 2026 9:24 AM

సద్వినియోగం చేసుకోవాలి రేపు రవీంద్రభారతిలో జాతీయ సదస్సు యాదాద్రీశుడి సేవలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె చేవెళ్ల: యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి వారిని శుక్రవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయన పెళ్లి రోజు సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చుకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. కాంగ్రెస్‌ మున్సిపల్‌, మండల నాయకులు ఎమ్మెల్యే దంపతులకు ఉదయం వారి నివాసంలో శుభాకాంక్షలు తెలిపి కేక్‌ కట్‌ చేయించారు. మహనీయుల ఆశయ సాధనకు కృషి

అనంతగిరి: యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయని జెడ్పీ సీఈఓ సుధీర్‌ అన్నారు. శుక్రవారం వికారాబాద్‌లోని ఐటీఐ ఏటీసీలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యన మాట్లాడుతూ.. ఏటీసీలో కొత్త కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు జైపాల్‌రెడ్డి, మాధవరెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం మహేశ్వర్‌, జిల్లా ఉపాఽధి కల్పన అధికారి సుభాన్‌ పాల్గొన్నారు.

బొంరాస్‌పేట: సుప్రసిద్ధ వాగ్గేయకారుడు, కవి శ్రీ రాకమచర్ల వెంకటరామదాసు జీవితం, సాహిత్యంపై ఈ నెల 26న రవీంద్రభారతిలో జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో సదస్సు జరగనున్నట్లు అనంత వేదిక వ్యవస్థాపకులు దొరవేటి చెన్నయ్య, జిల్లా కవులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కవులు డా. తూర్పు మల్లారెడ్డి, తుల్జా రాంసింగ్‌ ఠాకూర్‌, ఆశీర్వాదం, వడిచర్ల సత్యం, గంటా మనోహర్‌రెడ్డి, చిగురాల్‌పల్లి ప్రసాద్‌, కమలేశ్‌ హాజరుకానున్నట్లు తెలిపారు. జిల్లాలోని కవులను, రచయితలను వెలికితీయడం, జిల్లా తెలుగు సాహిత్య చరిత్రను చాటిచెప్పడం కోసం అనంత వేదిక కృషి చేస్తోందన్నారు.

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

చేవెళ్ల: మహనీయుల ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు పాటుపడాలని తెలంగాణ శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం ఆయన నగరంలోని తన నివాసంలో ఈ నెల 30న మున్సిపల్‌ కేంద్రంలో నిర్వహించనున్న మహనీయుల జాతర వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహనీయుల జాతరకు ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. సామాజిక న్యాయం, సమానత్వం, అంటరానితనం నిర్మూలనకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులను స్మరించుకోవడం మన కర్తవ్యం అన్నారు. కార్యక్రమంలో మహనీయుల జాతర కమిటీ చైర్మన్‌ బురాన్‌ ప్రభాకర్‌, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పామెన భీంభరత్‌ పాల్గొన్నారు.

ఘన నివాళి

బంట్వారం: మండలంలోని సల్బత్తాపూర్‌కు చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు పాండు రంగారెడ్డి(90) మృతి చెందాడు. శుక్రవారం స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. స్పీకర్‌ వెంట మర్పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వెంకటేశం తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement