పరిగి: ప్రజా రవాణాకు ఆటంకం కలిగిస్తే చర్యల తప్పవని ఎస్పీ స్నేహ మెహ్ర హెచ్చరించారు. శుక్రవారం పరిగి ఆర్టీసీ డిపో, బస్టాండ్‌ను పరిశీలించారు. కార్మికుల సమ్మె గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బస్సుల రాకపోకలు, ప్రయాణికుల కోసం తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు. విధులకు హాజరయ్యే ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లు ఇతర సిబ్బంది భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. పోలీస్ శాఖ భద్రత కల్పిస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదన్నారు. ప్రజా స్వామ్యబద్దంగా నిరసన తెలుపుకోవచ్చని.. ప్రజల జీవనానికి, ప్రయాణికులకు ఇబ్బందిగా మారకూడదన్నారు. జిల్లాలోని అన్ని డిపోల్లో ప్రశాంత వాతావరణం ఉందని తెలిపారు. స్వచ్ఛంగా విధులకు వచ్చే ఉద్యోగులకు భద్రత కల్పిస్తామన్నారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యథావిధిగా ప్రయాణాలు సాగించవచ్చని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
ప్రజా రవాణాకు ఆటంకం కలిగిస్తే చర్యలు
ఎస్పీ స్నేహ మెహ్ర


