బీజేపీ మెడికల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి
అనంతగిరి: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీజేపీ మెడికల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం వికారాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు బీఆర్‌ఎస్ హయాంలో కూడా అన్యాయం జరిగిందన్నారు. శంకర్‌గౌడ్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బీజేపీ నాయకులను అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నవీన్‌కుమార్, జిల్లా నాయకులు మోహన్‌రెడ్డి, శివరాజు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


