కొడంగల్ రూరల్: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ శుక్రవారం రాత్రి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ నెల 18న మండల పరిధిలోని ప్యాలమద్ది గేటు సమీపంలో అనారోగ్య కారణంగా ఓ మహిళ కింద పడిందనే సమాచారాన్ని పోలీసులు అందుకొని 108 వాహనంలో కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. మహిళను ఎవరైనా గుర్తిస్తే కొడంగల్ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు తెలియజేయాలని ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. ఫోన్ నెంబర్ 87126 70046లో సంప్రదించాలని తెలిపారు.


