ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి
శంకర్‌పల్లి: బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడిగా శంకర్‌పల్లి మండలం గోపులారం గ్రామానికి చెందిన తొండ రవిని నియమించినట్లు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు క్రాంతికిరణ్ శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానం తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేసేలా పనిచేస్తానన్నారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
బీసీ ఉద్యోగుల సంఘండైరీ ఆవిష్కరణ
షాద్‌నగర్‌రూరల్: పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం బీసీ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు రాజమౌళి మహేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, బీసీ ఉద్యోగుల సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పద్మనళిని హాజరయ్యారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు, సంక్షేమం కోసం సంఘంపని చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రాఘవేందర్‌గౌడ్, గోపాల్, అనిత, మహేశ్ పాల్గొన్నారు.
గిన్నిస్ రికార్డ్ కరాటే ప్రదర్శనకు విద్యార్థుల ఎంపిక
మీర్‌పేట: నగరంలో ఈనెల 26న నిర్వహించనున్న గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కరాటే ప్రదర్శనకు జిల్లెలగూడ కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు ద టెంపుల్ ఆఫ్ డ్రాగన్ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్, డైరెక్టర్ దాసరి జితేందర్‌కుమార్ తెలిపారు. ఎంపికై న విద్యార్థులను శుక్రవారం ఉదయం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్కూల్ ప్రెసిడెంట్ జైపాల్‌రెడ్డి, డైరెక్టర్ సురేష్‌రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రసూన అభినందించారు.
చౌలపల్లి ఘటనలో కేసు నమోదు
షాద్‌నగర్‌రూరల్: చౌలపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం పంచాయతీ కార్యదర్శితో ఘర్షణకు దిగిన వారిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ ప్రణయ్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని చౌలపల్లికి చెందిన సయ్యద్ అక్రమ్ ఇందిరమ్మ ఇల్లు విషయంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌తో వాగ్వివాదానికి దిగుతుండగా పక్కనే ఉన్న వార్డు సభ్యుడు ఇక్రంఅలీ సయ్యద్ అక్రమ్‌ను బయటకు గెంటేశాడు. ఈ క్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ సయ్యద్ అక్రమ్ తన కుమారులు సయ్యద్ ఇమ్రాన్, సయ్యద్ ఇర్ఫాన్‌తో కలిసి వార్డు సభ్యుడు ఇక్రంఅలీతో పాటు తనపై దాడికి ప్పాడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టి దాడికి పాల్పడిన తండ్రీకొడుకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


