యాచారం: మండల పరిధిలోని కొత్తపల్లిలో శుక్రవారం ఓ వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన కొండాపురం బాబయ్య ఓ భూ వివాదంలో తన కుటుంబ సభ్యుల నుంచి రావాల్సిన డబ్బులు అందడం లేదని, వెంటనే ఇప్పించాలని గ్రామంలోని సెల్‌టవర్ ఎక్కాడు. తనవారి నుంచి డబ్బులు ఇప్పిస్తేనే కిందికి దిగుతానని, లేదంటే దూకుతానని హెచ్చరికలు చేశాడు. సమాచారం అందుకున్న యాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి అతనితో మాట్లాడారు. సీఐ హామీతో బాబయ్య సెల్‌టవర్ దిగివచ్చాడు. అతన్ని పీఎస్‌కు తీసుకెళ్లిన సీఐ బాబయ్య కుటుంబ సభ్యులను పిలిపించి డబ్బులు ఇప్పించడంతో సమస్య సద్దుమణిగింది. సెల్ టవర్ ఎక్కి హంగామా సృష్టించడం నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని బాబయ్యను మందలించి, ఇంటికి పంపించారు.
సీఐ చొరవతో సద్దుమణిగిన వివాదం


