పరిగి: విద్యార్థుల కష్టపడి చదివి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రద్ధగా చది వితే మెరుగైన ఫలితాలు వస్తాయని, సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమ లు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకొని ఉన్న త స్థానాలకు చేరుకోవాలని సూచించారు. పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలన్నారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలన్నారు. పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తేవాలన్నారు. వాటిని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్‌ప్రసాద్, ఆర్‌డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ వెంకటేశ్వరి, మున్సిపల్ చైర్మన్ రజిత, డీఎస్‌డబ్ల్యూ జైపాల్‌రెడ్డి, కౌన్సిలర్ హబీబ్ ఉన్నిసా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయూబ్ తదితరులు పాల్గొన్నారు.
సమర్థవంతంగా నిర్వహించాలి
అనంతగిరి: జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగణన మొదటి విడతలో ఇళ్ల గణన ఉంటుందన్నారు. కుటుంబాల వివరాలు పూర్తిగా నమోదు చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


