ఖర్గే వ్యాఖ్యలు అర్థరహితం | - | Sakshi
Sakshi News home page

ఖర్గే వ్యాఖ్యలు అర్థరహితం

Apr 23 2026 8:36 AM | Updated on Apr 23 2026 8:36 AM

● బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంధయ్య ● చౌడాపూర్‌లో దిష్టిబొమ్మ దహనం

● బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంధయ్య ● చౌడాపూర్‌లో దిష్టిబొమ్మ దహనం

కుల్కచర్ల: ప్రపంచం మెచ్చిన నేత ప్రధాని మోదీ అని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంధయ్య, చౌడాపూర్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా చౌడాపూర్‌లోని ప్రధాన చౌరస్తాలో ఆయన దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ.. అవినీతిని నిర్మూలన లో.. భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దుతున్న మోదీపై ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.కాంగ్రెస్‌వి అవకాశవా ద రాజకీయాలని విమర్శించారు. హిందుత్వవాదం బలపడుతుండటాన్ని జీర్ణించుకోలేక తమిళనాడు ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నా రు. పద్ధతి మార్చుకోకపోతే బీజేపీ కార్యకర్తలు తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించా రు.కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, నాయకులు మాసయ్య, వెంకటేశ్‌, గిరిజన మోర్చా నాయకులు శంకర్‌ నాయక్‌, బాల్‌రాజ్‌, మల్లేశం, జనార్దన్‌, నర్సింలు, రాము, కృష్ణయ్య, రమేష్‌ పాల్గొన్నారు.

ఫైరింగ్‌ ప్రాక్ట్టీస్‌

అనంతగిరి: జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో వార్షిక మొబిలైజేషన్‌ శిక్షణ కార్యక్రమంలో భాగంగా బుధవారం మున్సిపల్‌ పరిధిలోని కొత్రెపల్లి గ్రామ శివారులో పోలీసులు ఫైరింగ్‌ ప్రాక్ట్టీస్‌ చేశారు. ఎస్పీ స్నేహమెహ్ర పాల్గొని ఆయుధాల పనితీరును పరిశీలించారు. స్వయంగా ఫైరింగ్‌ ప్రాక్టిస్‌ చేశారు. ఆయుధాలు వాడే సమయంలో భద్రతా నియమాలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ వీరేష్‌, ఆర్‌ఐ నాగరాజు, శ్రీశైలం, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

విజయశాంతికి

హోంమంత్రి ఇవ్వాలి

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌యాదవ్‌

బంట్వారం: ఎమ్మెల్సీ విజయశాంతికి రాష్ట్ర క్యాబినెట్‌లో చోటు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి అత్తెల్లి లక్ష్మణ్‌యాదవ్‌ కోరా రు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వెనుకబడిన వర్గానికి చెందిన ఆడ బిడ్డ విజయశాంతికి హోంమంత్రి పదవి ఇస్తే బీసీలకు న్యాయం చేసినట్లు అవుతుందన్నారు. తెలంగాణ బీసీ వర్గం అంతా ఆమెకు మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. ఇదే విషయమై సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి విన్నవిస్తామన్నారు.

26 నుంచి గడ్డం శైలజ స్మారక క్రికెట్‌ టోర్నీ

ధారూరు: స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ సతీమణి గడ్డం శైలజ స్మారక క్రికెట్‌ టోర్నమెంట్‌ ఈ నెల 26 నుంచి ధారూరులో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ మండల యువ నాయకుడు తిరుగారి మల్లేశం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. టోర్నమెంట్‌లో పాల్గొనే జట్లు రూ.999 ఎంట్రీ ఫీజు చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. విజేత జట్టుకు రూ.20 వేలు, ట్రోఫీ, రన్నర్‌ జట్టుకు రూ.10 వేల నగదు బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్‌ నంబర్‌ 9573337457, 7674804764, 709351 6593లలో సంప్రదించాలన్నారు.

ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి

అనంతగిరి: అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకెళ్లాలని కలెక్టర్‌ దీపక్‌తివారి బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు.ఇందుకు కోసం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి వైద్యులను సంప్రదించాలన్నారు.యాత్రికులు తమ ఆధార్‌,గుర్తింపు కార్డులు,ఇటీవల దిగిన పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోతో పాటు ఆరోగ్య చికిత్స పత్రాలతో సంప్రదించాలన్నారు.ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు.మరిన్ని వివరాలకు సెల్‌ నంబర్‌లో 9491738499లోసంప్రదించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement