కూలి పనులకు వెళ్తూ అనంతలోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

కూలి పనులకు వెళ్తూ అనంతలోకాలకు..

Apr 23 2026 8:36 AM | Updated on Apr 23 2026 8:36 AM

● కుక్క అడ్డురావడంతో అదుపుతప్పిన బైక్‌ ● రోడ్డు పక్క దిమ్మెను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం ● భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు

దుద్యాల్‌: కూలి పనుల కోసం బైక్‌పై వెళ్తున్న దంపతులకు కుక్క అడ్డు రావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. దుద్యాల్‌ ఎస్‌ఐ శ్రీశైలం కథనం మేరకు.. బొంరాస్‌పేట్‌ మండలం నాందర్‌పూర్‌ గ్రామానికి చెందిన డావుల యాదయ్య(35), భార్య నర్సమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం నారాయణపేట్‌ జిల్లా కోస్గి మండలంలో కూలి పనుల కోసం బైక్‌పై బయలుదేరారు. దుద్యాల్‌ మండలం సంట్రకుంట తండా గేట్‌ వద్ద బైక్‌కు కుక్క అడ్డు రావడంతో దాన్ని తప్పించే క్రమంలో రోడ్డు పక్కన ఉన్న దిమ్మెను బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో యాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. నర్సమ్మకు తీవ్ర గాయాలు కావడంతో కొడంగల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరికి ఒక పాప ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీశైలం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement