పరిగి: విద్యుదాఘాతానికి గురై యువ రైతు మృతి చెందిన ఘటన మండలంలోని పేటమాధారం గ్రామంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మంచన్‌పల్లి మల్లమ్మ, అనంతయ్య దంపతులకు చెందిన మహేశ్(22) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పొలంలోని బోరు మోటారు స్టార్టర్ చెడిపోవడంతో వైరు బిగిస్తుండగా కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మహేశ్ చనిపోయిన విషయాన్ని చుట్టు పక్కల రైతులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఉన్న ఒక్క కుమారుడు మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.


