ఇబ్రహీంపట్నం: రైతులందరూ జూన్ 2వ తేదీలోపు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పకుండా చేయించుకోవాలని తహసీల్దార్ సునీతారెడ్డి, మండల వ్యవసాయాధికారిణి విద్యాధరి కోరారు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం గ్రామ పాలనాధికారులు, పంచాయతీ కార్యదర్శులకు, మీ సేవ కేంద్రాల సిబ్బందికి ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల లబ్ధి పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. సమీప మీ సేవ కేంద్రాలకు భూమి పాస్ బుక్ వివరాలు, ఆధార్, ఓటీపీ వచ్చే ఫోన్‌తో వెళ్లి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. రైతులందరికీ తగు సలహాలు సూచనలు పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్‌గౌడ్, ఏఈఓలు శ్రవణ్, సృజన పాల్గొన్నారు.


