కదలని బస్సులు.. అవస్థల్లో ప్రయాణికులు | - | Sakshi
Sakshi News home page

కదలని బస్సులు.. అవస్థల్లో ప్రయాణికులు

Apr 23 2026 8:36 AM | Updated on Apr 23 2026 8:36 AM

పరిగి: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఆయా గ్రామాల నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులు అవస్థలు పడ్డారు. పరిగి కేంద్రం నుంచి మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, వికారాబాద్‌, షాద్‌నగర్‌, కర్ణాటకకు ఎక్కువ మంది ప్రయాణిం చేస్తుంటారు. ఉదయం నుంచే బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు కాశారు. సమ్మె కారణంగా ప్రైవేటు వాహనదారులు రెండింతలు చార్జీలు వసూలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్‌ఎస్‌ నాయకులు మద్దతు పలికారు. ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు, బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రవీణ్‌రెడ్డి, శివనోళ్ల భాస్కర్‌, శ్రీనివాష్‌, నరేష్‌, రవీందర్‌, తాహేర్‌అలీ తదితరులు పాల్గొన్నారు.

కార్మికుడిపై చేయి చేసుకున్న డీఎస్పీ

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుడిపై పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌ చేయి చేసుకున్నారు. దీంతో కార్మిక సంఘాలు మండిపడ్డాయి. పరిగి డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కార్మికుల మధ్య తోపులాట జరిగింది. కార్మికులను అరెస్టులు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. డీఎస్పీ తీరుపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Advertisement
 
Advertisement
Advertisement