ఇసుక డంప్‌ల సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

ఇసుక డంప్‌ల సీజ్‌

Apr 23 2026 8:36 AM | Updated on Apr 23 2026 8:36 AM

నేడు మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

బొంరాస్‌పేట: మండలంలోని దుప్‌చర్ల శివారులో వాగు నుంచి అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను బుధవారం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ శిరీష ఆధ్వర్యంలో సీజ్‌ చేశారు. ఎనిమిది ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గురువారం ఇసుకకు వేలం నిర్వహించనున్నట్లు ఆర్‌ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో

నలుగురికి తీవ్ర గాయాలు

పరిగి: ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని నస్కల్‌ గ్రామ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌ మండలం బురాన్‌పల్లి గ్రామానికి చెందిన పెద్దింటి లాలయ్య, జయమ్మ దంపతులు పరిగి నుంచి వికారాబాద్‌కు బైక్‌పై వెళ్తుండగా నస్కల్‌ గ్రామానికి చెందిన రాములు, పొచయ్య వికారాబాద్‌ నుంచి నస్కల్‌కు తమ బైక్‌పై వస్తున్న క్రమంలో నస్కల్‌, గొట్టిముక్కల గేట్‌ మధ్యలో బైక్‌లు ఢీకొన్నాయి. గాయపడిన నలుగురిని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం వికారాబాద్‌కు తరలించారు.

గిరిజన తండాలకు ప్రాధాన్యం

కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి

బొంరాస్‌పేట: సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గిరిజన పంచాయతీలకు ప్రాధాన్యం కల్పిస్తోందని కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈమేరకు బుధవారం మండలంలోని మదన్‌పల్లితండా, లోతికుంటతండా, బుర్రితండా, కట్టుకాల్వతండాల్లో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి బుధవారం శంకుస్థాపనలు చేశారు. రూ.30లక్షల చొప్పున నిధులతో నూతన పంచాయతీ భవనాలు నిర్మంచనున్నట్లు తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు నర్సింలుగౌడ్‌, నాయకులు వెంకట్రాములుగౌడ్‌, జయకృష్ణ, మల్లేశ్‌, మల్లికార్జున్‌, అంజిల్‌రెడ్డి, నర్సింలునాయుడు, సర్పంచులు శంకర్‌నాయక్‌, శాంతిబాయి, రేణుక, కిషన్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆమనగల్లు: ఆమనగల్లు మున్సిపాలిటీలో కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు ఈనెల 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆమనగల్లు మున్సిపల్‌ కమిషనర్‌ శంకర్‌ నాయక్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీలో నాలుగు కోఆప్షన్‌ పదవులకు 13 మంది నామినేషన్‌లు దాఖలు చేశారు. దీంతో నలుగురు సభ్యుల ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికలు నిర్వహించనున్నారు. సమావేశానికి 15 మంది కౌన్సిలర్‌లతో పాటు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా హాజరు కానున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement