డిగ్రీ కళాశాలకు ఫర్నిచర్‌ అందజేత | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ కళాశాలకు ఫర్నిచర్‌ అందజేత

Apr 23 2026 8:36 AM | Updated on Apr 23 2026 8:36 AM

కొడంగల్‌ రూరల్‌: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పూర్వ ప్రిన్సిపాల్‌ కీ.శే.డాక్టర్‌ వగ్గు మనోహర్‌గౌడ్‌ జ్ఞాపకార్థం వారి కుటుంబసభ్యులు బుధవారం రూ.రెండు లక్షల విలువ కలిగిన 15 గ్లాస్‌ అల్మారాలను అందజేశారు. మనోహర్‌గౌడ్‌ 2010–15 వరకు కొడంగల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పని చేశారని ప్రస్తుత ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌రెడ్డి గుర్తు చేశారు. కళాశాలకు బహూకరించిన అల్మారాలు లైబ్రరీ, ప్రయోగశాలల అవసరాలకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. సేవా దాతృత్వాన్ని కొనియాడారు. దాతలు వగ్గు ఉమాదేవి ఎన్‌ఆర్‌ఐ వగ్గు కిరిటీలకు ధన్యవాదాలు తెలిపారు. 2025–26విద్యా సంవత్సరం నుంచి పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టులో డా.మనోహర్‌గౌడ్‌ మెమోరియల్‌ అవార్డుతో రూ.5వేల నగదు, బంగారు పథకం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాస్కర్‌గౌడ్‌, సతీష్‌గౌడ్‌, నవీన్‌గౌడ్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ రఫియాఖానమ్‌, అధ్యాపక సిబ్బంది టి.రాంబాబు, ఆర్‌.శ్రీనివాస్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement