బోసిపోయిన బస్టాండ్‌ | - | Sakshi
Sakshi News home page

బోసిపోయిన బస్టాండ్‌

Apr 23 2026 8:36 AM | Updated on Apr 23 2026 8:36 AM

అనంతగిరి: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. వికారాబాద్‌ డిపో నుంచి ఒక్క బస్సు కూడా కదల్లేదు. ఉదయం 5గంటల నుంచే కార్మికులు డిపో వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేదాకా సమ్మె ఆపేది లేదన్నారు. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రైవేటు వాహనాలు, రైళ్లు కిటకిటలాడాయి. బీజేపీ నాయకులు ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపారు. నాలుగు ప్రైవేటు బస్సులను నడిపించారు. ప్రయాణికులు లేక వికారాబాద్‌ బస్టాండ్‌ బోసిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement