● జాతరను విజయవంతం చేయాలి
● ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
యాలాల: మండలంలోని తిమ్మాయిపల్లి శివారులో గల విఠలేశ్వరాలయ అభివృద్ధికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. మే 2 నుంచి 4వ తేదీ వరకు జాతర జరగనుంది. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జాతరకు రావాలని గ్రామ సర్పంచ్ అమర్‌నాథ్‌రెడ్డి, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు భీమప్ప, ఏఎంసీ డైరెక్టర్ రాజు, ఉపసర్పంచ్ నర్సింలు, గ్రామపెద్దలు ఎమ్మెల్యేను ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆలయానికి వెళ్లే మార్గంలో అవసరమైన చోట సీసీ రోడ్డు, బోరు, విద్యుత్ సౌకర్యం, మౌలిక వసతుల కల్పనకు వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉత్సవాను విజయవంతం చేయాలని గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు భీంరెడ్డి, వడ్ల దామోదర్, రవీందర్‌రెడ్డి, ఈడ్గి రాజు, శ్రీధర్‌రెడ్డి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.


