ఎరువుల కొరత రావొద్దు | - | Sakshi
Sakshi News home page

ఎరువుల కొరత రావొద్దు

Apr 22 2026 9:24 AM | Updated on Apr 22 2026 9:24 AM

ఉక్కపోత.. కొడదాం ఈత వేసవితాపం నుంచి సేద తీరేందుకు విద్యార్థులు, చిన్నారులు ఈత కొట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. 8లోu 9లోu

ఉక్కపోత.. కొడదాం ఈత వేసవితాపం నుంచి సేద తీరేందుకు విద్యార్థులు, చిన్నారులు ఈత కొట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.

అర్హులందరికీ పంట రుణాలివ్వాలి

కలెక్టర్‌ దీపక్‌ తివారి

బంట్వారం: ఖరీఫ్‌ సాగుకు ఎరువుల కొరత లేకుండా చూడాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయం, రేషన్‌ దుకాణాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రైతు వేదిక, కేజీబీవీని సందర్శించారు. ఈ సందర్భంగా పంట రుణాలు, ఎరువుల పంపిణీ గురించి సొసైటీ సీఈఓ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. రానున్న వర్షాకాలం నాటికి ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచాలన్నారు. ముందస్తు ప్రణాళికతో సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన రైతులందరికీ పంట రుణాలు అందేలా చూడాలన్నారు. అంతకుముందు రేషన్‌ దుకాణాల్లో స్టాక్‌ వివరాలు, పంపిణీ చేసిన లబ్ధిదారుల సంఖ్యను డీలర్లను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్‌సీని సందర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కేజీబీవీ హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. వేసవి సెలవుల్లో ఇంటి వద్దే ఉండాలని ఎండలో తిరగరాదని జాగ్రత్తలు చెప్పారు. కార్యక్రమంలో డీఈఓ రేణుకాదేవి, డీఏఓ రాజరత్నం, ఎంపీడీఓ రాములు, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, డీటీ మహేశ్‌, ఏఓ శ్రావ్య, సొసైటీ సీఈఓ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement