కాంగ్రెస్‌తోనే తండాల అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే తండాల అభివృద్ధి

Apr 22 2026 9:24 AM | Updated on Apr 22 2026 9:24 AM

దుద్యాల్‌: తండాలు అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్‌తోనే సాధ్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్‌ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని సంట్రకుంట తండాలో రూ.30 లక్షల వ్యయంతో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్‌తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో తండాలను పట్టించుకోకపోవడంతో పూర్తిగా వెనుకబడిపోయాయన్నారు. తండాలను అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, గ్రామాల్లో సీసీ రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కారం కోసం బోర్లు వేయిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, పంచాయతీ రాజ్‌ ఏఈ సురేందర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, కొడంగల్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ఆకారం వేణుగోపాల్‌, ఎస్టీ సెల్‌ మండల అధ్యక్షుడు రవి నాయక్‌, వివిధ గ్రామాల సర్పంచ్‌లు మాణిక్యనాయక్‌, నరేశ్‌ రాథోడ్‌, మొగులప్ప, మహిళా సమైక్య గ్రామ అధ్యక్షురాలు సరిత, పంచాయతీ కార్యదర్శి కిషన్‌, నాయకులు సంతోష్‌, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement