కొడంగల్‌కు ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీ | - | Sakshi
Sakshi News home page

కొడంగల్‌కు ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీ

Apr 22 2026 9:24 AM | Updated on Apr 22 2026 9:24 AM

ఏర్పాటుకు సన్నాహాలు

సాగుపై రైతులు దృష్టి సారించాలి

కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి

దుద్యాల్‌: కొడంగల్‌ నియోజకవర్గానికి త్వరలో ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీ మంజూరు కానున్నట్లు కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని హకీంపేట్‌ రైతు వేదికలో ఆయిల్‌ పామ్‌ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్‌ పామ్‌ సాగు చేయవచ్చని సూచించారు. ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందన్నారు. ఒక్కసారి పంట సాగుచేస్తే దీర్ఘకాలం పాటు లాభాలు పొందవచ్చని తెలిపారు. కొడంగల్‌ రైతులను దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్‌రెడ్డి ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి సత్తార్‌, కొడంగల్‌ హార్టికల్చర్‌ అధికారి సురేందర్‌ నాథ్‌, హెచ్‌ఈఓ బాబ్యానాయక్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఏ శేఖర్‌, సర్పంచ్‌లు చంద్రయ్య, నరేఽశ్‌ రాఽథోడ్‌, పంచాయతీ కార్యదర్శి ఆనంద్‌ కుమార్‌, ఎస్టీ సెల్‌ మండల అధ్యక్షుడు రవి నాయక్‌, నాయకులు శ్రీనివాస్‌ రెడ్డి, సీతారాం నాయక్‌, లక్ష్మయ్య, రాములు, నరేందర్‌ గౌడ్‌, మహేశ్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement