తాండూరు టౌన్: దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో తాండూరు, యాలాల మండలాల కార్యకర్తల కోసం పండిట్ దీన్‌దయాళ్ ప్రశిక్షణా అభియాన్ రెండోరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచ పరివర్తనలు అనే ముఖ్యాంశాలపై కార్యకర్తలకు పలువురు సమగ్ర అవగాహన కల్పించారన్నారు. పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేయాలన్నారు. పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యత అన్నారు. కార్యక్రమంలో బాలేశ్వర్ గుప్తా, మనోహర్ రావు, కృష్ణ ముదిరాజ్, పటేల్ విజయ్, భద్రేశ్వర్, సందీప్, శ్రీకాంత్, పలు మండలాల అధ్యక్షులు, సభ్యులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడురమేష్ కుమార్


