భయాందోళనలో ప్రజలు
దోమ: గ్రామాల్లో డ్రోన్లు కలకలం రేపుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నిత్యం ఐదు నుంచి ఆరు డ్రోన్లు తిరుగుతున్నట్లు మోత్కూర్, దాదాపూర్ గ్రామాల ప్రజలు తెలిపారు. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. అధికారులు కూడా స్పష్టత ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సోమవారం మండలంలోని మోత్కూర్, దాదాపూర్ గ్రామాల్లో అర్ధరాత్రి డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. అట్టి వీడియోలను కొందరు ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇప్పటికే బట్లచందారం, అనంతరెడ్డిపల్లి, కొండాయపల్లి గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్కు కోసం అధికారులు భూములు సేకరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రోన్లు తిరుగుతున్నాయా అనే సందేహం వస్తోందని ప్రజలు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు డ్రోన్ల గురించి తెలియజేయాలని మోత్కూర్, దాదాపూర్ ప్రజలు కోరారు.


