వెల్‌డన్‌ మహిపాల్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

వెల్‌డన్‌ మహిపాల్‌రెడ్డి

Apr 22 2026 8:36 AM | Updated on Apr 22 2026 8:36 AM

వెల్‌డన్‌ మహిపాల్‌రెడ్డి

ఎంఈఓను సన్మానించిన విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌

యాలాల: ఇటీవల మండల స్థాయిలో ఐదో తరగతి విద్యార్థులకు ఎంఈఓ మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్‌ సెర్చ్‌ కార్యక్రమం అభినందనీయమని విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ అన్నారు. మంగళవారం రాష్ట్ర కార్యాలయంలో ఎంఈఓని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 53 ప్రాథమిక పాఠశాలలకు చెందిన 600 మంది విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఇలాంటి టాలెంట్‌ టెస్ట్‌లను జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించేలా పరిశీలిస్తామని పేర్కొన్నారు. అనంతరం ఎంఈఓ మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. మండలంలోని పాఠశాలల సిబ్బంది, ఎమ్మార్సీ సిబ్బంది చేయూతతో టాలెంట్‌ సెర్చ్‌ కార్యక్రమం విజయవంతం చేశామన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్‌సీఈఆర్టీ సిబ్బంది మధుసూదన్‌రెడ్డి, యాసిన్‌, మండల ఆర్పీ మురహరి తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement