● ఇబ్బంది పడుతున్న ఉపాధి కూలీలు
● కొత్త నిబంధనలతో పనులకు దూరమవుతున్న పలువురు కార్మికులు
భగభగ మండే భనుడి ప్రతాపాన్ని తట్టుకొని శ్రమించినా డబ్బులు సకాలంలో అందడం లేదని జాతీయ ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదారు వారాలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబపోషణ భారంగా మారిందని మంగళవారం ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో తేటతెల్లం అయింది. పని ప్రదేశంలో నీడ కోసం టెంట్లు, తాగునీటి సౌకర్యం, పరికరాలు, మెడికల్ కిట్ల కల్పించాల్సిఉండగా అంతంతమాత్రంగానే యంత్రాంగం చర్యలు చేపట్టింది.
హస్నాబాద్‌లో ఎండలోనే పనిచేస్తున్ను ఉపాధి కూలీలు


