● ముగ్గురు నిందితుల అరెస్ట్
● వివరాలు వెల్లడించిన రంగారెడ్డి జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కిషన్
అనంతగిరి: గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను పట్టుకుని 25 కేజీల గంజాయిని స్వాధీనం చేసకున్నట్లు రంగారెడ్డి జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కిషన్ తెలిపారు. వివరాలు.. ఒడిశా నుంచి సికింద్రాబాద్ మీదుగా మహారాష్ట్రలోని పర్బనీకి గంజాయి తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఒడిశా నుంచి ఓ వ్యక్తి 25 కేజీల గంజాయిని తీసుకువచ్చి ముగ్గురు వ్యక్తులకు ఇచ్చారు. వారు అనకాపల్లి నుంచి గుంటూర్‌కు వచ్చారు. అనంతరం పల్నాడ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి వికారాబాద్ స్టేషన్‌లో దిగారు. అక్కడ బెంగళూరు–నాందేడ్ రైలు కోసం వేచియుండగా పోలీసులు సోదాలు చేపట్టారు. వారి వద్ద నుంచి 12 బ్యాగుల్లో ఉన్న 25.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారురూ.10 లక్షలు ఉంటుందన్నారు. ఈ దాడుల్లో ఏఈఎస్ జీవన్‌కిరణ్, బాలరాజు, శ్రీనివాస్, వెంకటేశ్, రాకేశ్, శ్రీనివాస్, పలువురు అధికారులు పాల్గొన్నారు.


