కొడంగల్ రూరల్: టీబీ ముక్త్ అభియాన్‌ను సద్వినియోగం చేసుకోవాలని టీబీ ప్రోగ్రామ్ జిల్లా అధికారి డాక్టర్ రవీంద్రయాదవ్ సూచించారు. మంగళవారం పట్టణంలోని సివిల్ ఆస్పత్రిలో ఉచిత ఛాతి ఎక్స్ రే క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రోగులకు పలు సూచనలు అందించారు. టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని అన్నారు. ఇందులో భాగంగానే హై రిస్క్ గ్రామాలను ఎంపిక చేసి ఎక్స్‌రే క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్షయ వ్యాధిని ముందుగా గుర్తించి వైద్యుల సూచనలు పాటిస్తే నయమవుతుందని తెలిపారు. 126 మందికి ఎక్స్ రే తీశారని ఇందులో 8 మందిని టీబీ అనుమానితులుగా గుర్తించినట్లు తెలిపారు. వ్యాధి సోకిన వ్యక్తులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా పౌష్టికాహారం తీసుకుంటూ మందులను వాడటంతో వ్యాధిని నిర్మూలించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ సాకేత్, అంగడిరాయిచూర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బుస్రా ఫాతిమా, టీబీ సూపర్ వైజర్ రాహత్‌అలీ, ఎంఎల్‌హెచ్‌పీ డాక్టర్ అమృత, ఎక్స్ రే టెక్నీషియన్ రవి, హెల్త్ అసిస్టెంట్ మధుసూదన్‌రెడ్డి, ఏఎన్‌ఎం చంద్రకళ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రోగ్రామ్ జిల్లా అధికారి రవీంద్రయాదవ్


