పరిగి: మున్సిపల్ అభివృద్ధే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి సూచించారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో బడ్జెట్ సమావేశం నిర్వహించారు. బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు రవికుమార్, రవీందర్, శ్రీనివాస్, నరేష్, చంద్రకళ బల్దియా లావాదేవీలపై సమాధానం చెప్పాలని అధికారులను కోరారు. కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని వార్డులను అభివృద్ధి చేయడం నా బాధ్యత అని హామీ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పన, రహదారుల నిర్మాణం, డైనేజీ వ్యవస్థ, తాగునీటి తదితర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ప్రతి వార్డుకూ సమానంగా నిధులు కేటాయిస్తానని చెప్పారు. పార్టీలను పక్కన పెట్టి పట్టణాభివృద్ధికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని కౌన్సిలర్లకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రజిత, వైస్ చైర్మన్ హన్మంతు, కమిషనర్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం
మున్సిపల్ నిధుల దుర్వినియోగంపై త్వరలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు తెలిపారు. బడ్జెట్ సమావేశ అనంతరం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. 2025 – 26 ఆర్థిక సంవత్సరం(ప్రత్యేక అధికారుల పాలన)లో దాదాపు రూ.2 కోట్ల మేర నిధుల దుర్వినియోగమైనట్లు తెలిపారు. నిధులు కాజేసిన అధికారులను కాపాడేందుకు అధికార పార్టీ నాయకులు చూడటం సిగ్గు చేటన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కౌన్సిలర్లు రవికుమార్, శ్రీనివాస్, శివనోళ్ల చంద్రకళ భాస్కర్, శ్రీనివాస్, నరేష్, షమీనాబేగం, సునీత, రవీందర్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి


