మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత

Apr 1 2026 8:24 AM | Updated on Apr 1 2026 8:24 AM

ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

తాండూరు: మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. మహాలక్ష్మి పథకం విజయవంతం కావడంపై మంగళవారం తాండూరు ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో మహిళా ప్రయాణికులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను సీఎం రేవంత్‌రెడ్డి సమర్థవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణంతో పేద, మధ్య తరగతి వర్గాలకు ఎంతో మేలు చేకూరిందన్నారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజ, వైస్‌ చైర్మన్‌ అబ్దుల్‌ రజాక్‌, ఆర్టీసీ డీఎం సురేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement