అనంతగిరి: విధి నిర్వహణలో మనం చేసిన సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. వికారాబాద్ ఎస్పీ కార్యాలయం ఆవరణలో మహిళా పీఎస్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ పొందిన చంద్రయ్యకు మంగళవారం ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. చంద్రయ్యను పూలమాలలు, శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. 38 ఏళ్ల పాటు సర్వీస్ చేయడం చాలా గొప్ప విషయమన్నారు. పోలీస్ శాఖ పట్ల అంకిత భావంతో పనిచేశారని కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ వీరేష్, మహిళా పీఎస్ సీఐ సరోజ, ఆర్‌ఐ శ్రీశైలం, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ తదతరులు పాల్గొన్నారు.


