అనంతగిరి: సిమెంట్ వ్యాపారంలో తిరుగులేని సంస్థగా ఎదుగుతున్న భారతి సిమెంట్ అల్ట్రాఫాస్ట్ పేరుతో ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్ 5స్టార్ గ్రేడ్ తెలంగాణలో విడుదల చేసిందని ఆ సంస్థ టెక్నికల్ ఇంజనీర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు శనివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టంపల్లిలో శ్రీ తిరుమల ట్రేడర్స్ డీలర్ షాపులో సెంట్రింగ్ మేసీ్త్రల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్‌తో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్‌తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగవంతంగా పూర్తవుతుందని తెలిపారు. అల్ట్రాఫాస్ట్‌తో ముఖ్యంగా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారులకు సరైన ఎంపిక అన్నారు. వినియోగదారులకు ఉచిత సాంకేతిక సహాయం అందచేస్తామని స్లాబ్ కాంక్రీట్ సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజనీర్లు సైట్ వద్దకే వచ్చి సహాయపడుతారని చెప్పారు. డీలర్ బాలరాజ్ మాట్లాడుతూ.. భారతి సిమెంట్ సర్వీస్ చాలా ఫాస్ట్‌గా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతి సిమెంట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
సంస్థ టెక్నికల్ ఇంజనీర్ శ్రీకాంత్


