మీర్‌పేట: వాకింగ్ చేస్తున్న తల్లి, కూతురును కిడ్నాప్‌కు యత్నించిన వ్యక్తిని మీర్‌పేట పోలీసులు రిమాండ్‌కు తరలించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. అల్మాస్‌గూడ మధురాపురికాలనీకి చెందిన శ్రావణి (34) టీచర్. ఈ నెల 19న 9.30 గంటల ప్రాంతంలో ఆమె కుమార్తె (11)తో కలిసి ఇంటి వద్ద వీధిలో వాకింగ్ చేస్తుండగా గతంలో పరిచయం ఉన్న కొడంగల్‌కు చెందిన సంపత్‌కుమార్‌రెడ్డి కారులో వచ్చి శ్రావణి కూతురును కారులోకి లాగేందుకు యత్నించగా వెంటనే అప్రమత్తమైన శ్రావణి ప్రతిఘటించింది. దీంతో సంపత్‌కుమార్‌రెడ్డి శ్రావణిపై దాడి చేయడంతో ఆమె స్పృహ తప్పగా, ఇద్దరిని కారులో ఎక్కించుకున్నాడు. ఔటర్‌మీదకు తీసుకెళ్తుండగా శ్రావణి తేరుకోగా అరిస్తే చంపేస్తానని వారిద్దరిని బెదిరించాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కారు నిలిపారు. సమీపంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం కనిపించడంతో తల్లికూతుర్లు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు వారిని మీర్‌పేట ఠాణాలో అప్పగించారు. సందీప్‌కుమార్‌రెడ్డి గతంలో పలుమార్లు వేధించాడని, ప్రాణహాని ఉందని శ్రావణి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతన్ని రిమాండ్‌కు తరలించారు. సందీప్‌రెడ్డిపై కొడంగల్, ఎల్‌బీనగర్, మహబూబ్‌నగర్, మీర్‌పేట పోలీస్‌స్టేషన్ల పరిధిలో కేసుల్లో నిందితుడని, గతంలోనే రౌడీషీట్ నమోదైనట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
నిందితుడికి రిమాండ్


