ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు
రాజ్‌కుమార్ గౌడ్
డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఆనంద్
తాండూరు: మాతా శిశు ఆస్పత్రిలో వైద్య సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఆనంద్ ఆదేశించారు. శనివారం పట్టణ శివారులో ఉన్న మాతా శిశు ఆస్పత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వైద్య సేవలపై సూపరింటెండెంట్ డాక్టర్.వినయ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కొడంగల్ మండలం లక్ష్మిపల్లి గ్రామానికి చెందిన శిరీష కాన్పు కోసం కుటుంబ సభ్యులు మాతా శిశు ఆస్పత్రికి 108 వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యలో ఈ నెల 19వ తేదీన ప్రసవించిన ఘటనపై డీసీహెచ్‌ఎస్ ఆరా తీశారు. శిరీషతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది ఎలాంటి వివాదాలు తలెత్తకుండా రోస్టర్ ప్రకారం విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి ‘రైతు భరోసా’
ఎకరాకు రూ.ఆరు వేల చొప్పున జమ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా నగదు ఆదివారం నుంచి రైతుల ఖాతా ల్లో జమ కానుంది. సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. తొలి దశలో ఎకరంలోపు రైతుల ఖాతాల్లో నగదు జమకానుంది. ఆ తర్వాత రెండు, మూడు దశల్లో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నారు. నిజానికి యాసంగికి ముందే ఈ సహాయం అందజేయాల్సి ఉంది. పలు సాంకేతిక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. నేటి నుంచి రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేయ నుంది. రంగారెడ్డి జిల్లాలో 2,83,709 లక్షల మంది రైతులు ఉండగా, వీరు 6,35,502 ఎకరాలకుగాను సాయం పొందనున్నారు. ఈ జిల్లా రైతుల ఖాతాల్లో రూ.318 కోట్లకుపైగా జమకానుండగా, వికారాబాద్ జిల్లాలో 3,27,561 మంది రైతులు ఉండగా, వీరు 6,45,166 ఎకరాలకు రైతుభరోసా పొందనున్నారు. కొత్తగా మరో 15,784 మంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరి ఖాతాల్లో రూ.387 కోట్లకుపైగా జమ కానుంది. ఈ కార్యక్రమాన్ని రైతులు వీక్షించేందుకు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఆయా రైతు వేదికల్లో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్‌లు ఏర్పాటు చేశారు.


