వర్షాకాలం ఎంతో ప్రమాదంగా భవనం తయారవుతుంది. చిన్నపాటి వాన కురిసినా తరగతి గదులు నీటితో నిండుకునేవి. గోడలకు విద్యుత్ షాక్ వచ్చేది. వర్షం పడిన రోజు భయంతో పాఠశాలకు వచ్చేవాళ్లం కాదు. ప్రస్తుతం నూతనం భవనం తయారైంది. ఎలాంటి భయం లేకుండా పాఠశాలలో చదువుకుంటాం.
– నమిత, విద్యార్థిని, 9వ తరగతి
పాత భవనం ఇబ్బందిగా మారడంతో విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పాఠాాలు వినేవాళ్లు. ఇదే విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించాం. కాంట్రాక్టర్ వెంబడి పడి వేగంగా పనులు పూర్తి చేయించాం. మరో రూ.90 లక్షలతో ల్యాబ్‌లు, క్రీడాలకు సంబంధించిన గదులు, అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరాం.
– భీములు, కాంగ్రెస్ అధ్యక్షుడు, హస్నాబాద్


